Header Banner

పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం! ఏపీ రాజకీయాల్లో కీలక మలుపు!

  Sun Feb 23, 2025 18:53        Politics

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో కాసేపట్లో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. అందుకోసం జనసేన అధ్యక్షుడు, డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ కానున్నారు. బడ్జెట్ పై అవగాహన.. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై డిప్యుటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నారు. కాగా.. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ ఉంటుంది.


ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 


సభఎన్ని రోజులు నిర్వహించాలి అనే అంశంపై బీఏసీ లో చర్చిస్తారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు. హజారు కావాలని వైసీపీ నిర్ణయించింది. జగన్ తమ సభ్యులతో కలిసి సభకు వస్తున్నారు. గవర్నర్ ప్రసంగం తర్వాత కూడా సభకు వస్తారా లేక ఒక్క రోజుకే పరిమితమా అనేది స్పష్టత రావాల్సి ఉంది. వైసీపీ ప్రతి రోజు సమావేశాలకు హాజరైతే మాత్రం సభవాడిగా వేడిగా జరగనుంది. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు.. 8 నెలల పాలనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు సభకు వివరించనున్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ క్రమంలో.. అసెంబ్లీ సమావేశాలకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతియుత వాతావరణంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో స్పీకర్ సమీక్ష నిర్వహించారు.


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #janasena #meeting #deputycm #todaynews #flashnews #latestupdate